ముంబై తరపున 100 మ్యాచ్ లు ఆడిన సూర్య
NEWS Apr 05,2025 02:08 am
ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్య కుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన కీలక మ్యాచ్ అద్భుతంగా ఆడాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఐపీఎల్ కేరీర్ లో ముంబై తరపున తను 100 మ్యాచ్ లు పూర్తి చేశాడు. ఇది తన కెరీర్ లో రికార్డ్ అని చెప్పక తప్పదు. ఆ జట్టు తరపున వంద మ్యాచ్ లు పూర్తి చేసిన ఎనిమిదో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతకు ముందు ఇదే టీం తరపున ఏడుగురు 100 మ్యాచ్ లు ఆడారు. వారిలో రోహిత్ శఱ్మ, కీరన్ పోలార్డ్, హర్భజన్ సింగ్, లసిత్ మలింగ, బుబ్రా, పాండ్యా, అంబటి రాయుడు ఉన్నారు.