మరోసారి నిరాశ పరిచిన రిషబ్ పంత్
NEWS Apr 05,2025 01:54 am
ఐపీఎల్ మెగా వేలం పాటలో రూ. 27 కోట్ల అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ఆటగాడు రిషబ్ పంత్. తనను లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ఏరికోరి ఎంచుకుంది. తీరా 18వ సీజన్ ప్రారంభమైనా తన ఆటతీరులో ఇంకా మార్పు రాలేదు. కెప్టెన్ గా , ఆటగాడిగా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. ఇప్పటి వరకు తను ఆడిన నాలుగు మ్యాచ్ లలో చేసిన పరుగులు కేవలం 19 మాత్రమే. ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించాడు ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా. తను అందరి ముందే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా లక్నో వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో 2 పరుగులే చేసి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.