చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా
NEWS Apr 05,2025 01:44 am
ముంబై ఇండియన్స్ స్కిప్పర్ హార్దిక్ పాండ్యా రికార్డ్ సృష్టించాడు. ముంబై ఇండియన్స్ కోసం ఇంతకు ముందు ఎన్నడూ లేని ఐపీఎల్ ఫీట్‌ను సాధించాడు. ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో అత్యుత్తమమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టి20 క్రికెట్ ఫార్మాట్ లో తొలి 5 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఆ జట్టు తరపున ఇన్ని వికెట్లు తీయడం తనే మొదటిసారి. మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసింది లక్నో. నిర్ణీత 20 ఓవర్లలో 203 రన్స్ చేసింది. మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్ అద్భుతమైన హాఫ్ సెంచరీలు సాధించారు. హార్దిక్ పాండ్యా 36 రన్స్ ఇచ్చింది 5 వికెట్లు కూల్చాడు.