బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ గా మాజీ ఎమ్మెల్యే
NEWS Apr 04,2025 09:05 pm
WNP: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ గా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. చిన్నచింతకుంట మండలం పర్కాపూర్ గ్రామానికి చెందిన దివంగత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి సతీమణి మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి ఉస్మానియాలో MA సోషియాలజీ పూర్తి చేశారు.