గిట్టు బాటు ధర కోసం.. రైతుల ఆందోళన
NEWS Apr 04,2025 08:51 pm
MBNR: కోయిల్ కొండ మండలంలో మామిడి తోటల యజమానులు గిట్టుబాటు ధరపై ఆందోళన చెందుతున్నారు. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా.. రాత్రిలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పూత నిలబడేందుకు రూ. లక్షల విలువైన మందుల పిచికారీ చేశారు. కాపు దశ తక్కువగా ఉండటంతో తోటలను అద్దెకు తీసుకున్న యజమానులు.. పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో.. రాదోనని ఆందోళన చెందుతున్నారు.