బాబూ..ప్రత్యేక హోదా కథేంటి..?
NEWS Apr 04,2025 06:20 pm
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రె డ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఇచ్చిన హామీ సంగతి మరిచి పోయారా అంటూ మండిపడ్డారు. ఎన్నికల సందర్బంగా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకు వస్తామని ప్రకటించారని, కానీ ఇప్పటి వరకు దాని ఊసెత్తడం లేదంటూ ధ్వజమెత్తారు. దానిని సాధించేందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామంటూ బాబు చెప్పిన మాటలు నీటి మాటలుగా మిగిలి పోయాయని ఆరోపించారు. హోదాను పక్కన పెట్టిన సీఎం ఇప్పుడు పోలవరం కడతానంటూ మరో మోసానికి తెర లేపాడంటూ ఫైర్ అయ్యారు.