టీటీడీకి మొబైల్ ఫాస్ట్ ఫుడ్ వ్యాన్లు విరాళం
NEWS Apr 04,2025 02:52 pm
రుమల శ్రీవారికి శుక్రవారం బెంగళూరులోని ఎం.ఎస్.రామయ్య విద్యా సంస్థలకు చెందిన ఎం.ఎస్.సుందర్ రామ్ అనే భక్తుడు అన్న ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేసేందుకు రూ.45 లక్షల విలువైన అశోక్ లేల్యాండ్ కంపెనీకి చెందిన రెండు బడా దోస్త్ మొబైల్ ఫాస్ట్ ఫుడ్ వ్యాన్లను విరాళంగా అందించారు. ముందుగా అలయం వద్ద ఈ వాహనాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనం తాళాలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.