పాస్టర్ మృతిపై రాజకీయం తగదు
NEWS Apr 04,2025 09:30 am
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రాజకీయం చేయడం తగదని అన్నారు మంత్రి కొలను పార్థసారథి. కొందరు కావాలని ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూశారని మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఘటన జరిగిన వెంటనే సర్కార్ వెంటనే స్పందించిందన్నారు. హొం మంత్రి విచారణకు ఆదేశించారని, అయినా చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ వైపీపీ నేతలపై మండిపడ్డారు మంత్రి. సాంకేతికతను ఉపయోగించుకుని రెండు రోజుల్లోనే ప్రవీణ్ విషయంలో అసలేం జరిగిందో మొత్తం ప్రూవ్ చేశామన్నారు. ప్రవీణ్ కుటుంబీకులు సైతం సర్కార్ తీసుకున్న చొరవ పట్ల సంతోషం వ్యక్తం చేశారన్నారు.