తిరుమల పుణ్యక్షేత్రం భారీ ఆదాయం
NEWS Apr 04,2025 09:22 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 58 వేల 864 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 784 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.51 కోట్లు వచ్చిందని ఈవో జె. శ్యామల రావు. శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని వారికి 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.