రామానాయుడు స్టూడియో భూ కేటాయింపు రద్దు
NEWS Apr 04,2025 09:14 am
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. రామానాయుడు స్టూడియోలో కేటాయించిన భూములను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. స్టూడియోలో నివాస స్థలాలుగా మార్పు చేయాలని తలపెట్టిన 15.17 ఎకరాల భూ కేటాయింపు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. నిర్దేశించిన ప్రయోజనం కోసం ఇచ్చిన భూమిని వినియోగించనట్టయితే రద్దు చేయాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు సీఎస్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా వెల్లడించారు.