వైఎస్ సునీత ప్రాణాలకు రక్షణ లేదు
NEWS Apr 04,2025 09:05 am
ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ సునీత ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ వాపోయారు. మాజీ ఎంపీ , దివంగత వైఎస్ వివేకానంద రెడ్డికి గుండె పోటు వచ్చిందని చిత్రీకరించడం దారుణమన్నారు. ఆ సమయంలో వైఎస్ సునీతా రెడ్డి, ఆమె భర్త అక్కడ లేనే లేరని చెప్పారు. ఘటన జరిగినప్పుడు ఉన్నది వైఎస్ అవినాష్ రెడ్డేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. విచిత్రం ఏమిటంటే వైఎస్ వివేకా కేసులో సాక్షులు ఒక్కరొక్కరుగా చని పోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.