భూముల వివాదంపై కమిటీ ఏర్పాటు
NEWS Apr 04,2025 08:44 am
కంచ గచ్చిబౌలి లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 400 ఎకరాల భూముల వేలంకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. వెంటనే చెట్లు నరకడాన్ని నిలిపి వేయాలని ఆదేశించింది. ఒక్క ఇంచు కూడా ఆక్రమణకు గురి కాకూడదంటూ ఆదేశించింది. సీఎస్ శాంతి కుమారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేయడంతో గత్యంతరం లేక సర్కార్ దిగి వచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటితో కమిటీ ఏర్పాటు చేసింది.