ప్రభుత్వ భూముల కబ్జాలపై సీరియస్
NEWS Apr 04,2025 08:34 am
మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామరంలో ప్రభుత్వ భూములను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. క్వారీ లీజులు ముగిసినా అక్కడ నుంచి ఖాళీ చేయకుండా కబ్జాకు ప్రయత్నిస్తున్నారంటూ స్థానికులు ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన ఆయన రంగంలోకి దిగారు. పక్కనే ఉన్న స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ల్యాండ్ కబ్జాకు గురి కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 400ల వరకూ ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఏవీ రంగనాథ్.