చెలరేగిన కోల్ కతా తల్లడిల్లిన హైదరాబాద్
NEWS Apr 04,2025 07:57 am
ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఐపీఎల్ 2025 టోర్నీ 18వ సీజన్ లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడితే ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలుపొందింది. తాజాగా కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో 80 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. కేవలం 120 పరుగులకే చాప చుట్టేసింది. మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. హైదరాబాద్ బ్యాటర్లు పూర్తిగా నిరాశ పరిచారు. కేకేఆర్ బౌలర్ల దెబ్బకు ఎస్ ఆర్ హెచ్ విలవిల లాడింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత ఓవర్లలో 200 రన్స్ చేసింది.