ట్రాన్స్ఫార్మర్ లో రాగి తీగల చోరి
NEWS Apr 03,2025 08:34 pm
ఆలమూరు మండలంలోని జొన్నాడ లంక గోదావరి నది ఏటిగొట్టు సమీపాన ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లో రాగి తీగలు చోరీకి గురైనట్లు స్థానిక రైతులు తెలిపారు. వ్యవసాయ పంట పొలాలకు సాగునీరు అందించేందుకు 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను అధికారులు ఏర్పాటు చేశారన్నారు. అయితే బుధవారం రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్తు సరఫరాను నిలిపివేసి ట్రాన్స్ఫార్మర్ ను ధ్వంసం చేసి దానిలోని రాగి తీగలను చోరీ చేశారన్నారు.