యూనివర్శిటీ భూముల జోలికి వెళ్లవద్దు
NEWS Apr 03,2025 06:01 pm
సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏకి పారేసింది. ప్రధానంగా సీఎస్ శాంతి కుమారిపై తీవ్రస్థాయిలో మండిపడింది. ఆగమేఘాల మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. పర్యావరణం, అటవీశాఖ అనుమతులు తీసుకున్నారా అని నిలదీసింది. నిద్ర పోతున్నారా అంటూ మండిపడింది. హెచ్ సీయూ భూముల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. కంచ గచ్చిబౌలి స్థలాల్లో ఎలాంటి పనులు చేపట్ట వద్దంటూ ఆదేశించింది.