మంత్రివర్గ విస్తరణలో బీసీలకు ఛాన్స్
NEWS Apr 03,2025 02:28 pm
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. మంత్రివర్గ విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమేనని పేర్కొన్నారు. ఇవి తొలగి పోయాక త్వరలోనే ఏఐసీసీ ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రాంతాలు, కులాల వారీగా అన్నింటిని పరిగణలోకి తీసుకుని కేబినెట్ ను విస్తరించాల్సి ఉంటుందన్నారు. ఈసారి మైనార్టీ కోటాతో పాటు బీసీలకు కూడా చోటు దక్కనుందని సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్.