జస్టిస్ వర్మకు వ్యతిరేకంగా పిల్
NEWS Apr 03,2025 09:39 am
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే తన ఇంట్లో భారీ ఎత్తున నోట్ల కట్టలు దొరికాయి. మరికొన్ని అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ తరుణంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. తనను తొలగించాలని పార్లమెంట్ లో చర్చ జరిగింది. స్పీకర్ అనుమతి ఇవ్వలేదు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు తనను అలహాబాద్ కోర్టుకు బదిలీ చేసింది. దీనికి వ్యతిరేకంగా జస్టిస్ వర్మ ప్రమాణ స్వీకారానికి అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ న్యాయవాది అశోక్ పాండే పిల్ దాఖలు చేశారు. వర్మ బదిలీ, ప్రమాణ స్వీకారం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది.