రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు
NEWS Apr 03,2025 10:13 am
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది టీటీడీ. స్వామి వారి కోసం విరాళాలు అందించే వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. కలియుగ దైవం తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు టిటిడి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులలో మినహా మిగిలిన రోజులలో విరాళం ఇచ్చిన భక్తులు తమకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపింది.