ముంబైకి యశస్వి జైశ్వాల్ గుడ్ బై
NEWS Apr 03,2025 09:06 am
ప్రముఖ భారత క్రికెటర్ యశస్వి జైశ్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను ఇక నుంచి ముంబై జట్టుకు ఆడబోనంటూ ప్రకటించాడు. తను తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాలలో కలకలం రేపింది. ప్రస్తుతం ఐపీఎల్ 2025 టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తను ఓపెనర్ గా ఆడుతున్నాడు. గత సీజన్ లో దుమ్ము రేపిన జైశ్వాల్ తాజా సీజన్ లో అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచాడు. తనతో పాటు స్కిప్పర్ సంజూ శాంసన్ కూడా ఆశించిన మేర ఆడడం లేదు. ఇది పక్కన పెడితే ఉన్నట్టుండి తనను ముంబై జట్టు నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ బీసీసీఐకి యశస్వి జైశ్వాల్ లేఖ రాశాడు.