మేడిపల్లిలో సన్న బియ్యం పంపిణీ
NEWS Apr 02,2025 03:28 pm
మేడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మెట్ పల్లి ఎ.ఎమ్.సి డైరెక్టర్ నూతుల రవీందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామిని అమలు చేస్తున్న ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బందిల కృష్ణమూర్తి, పొడేటి రాజేష్ గౌడ్, బందిల ఆనంద్, బండి వినయ్, పప్పుల రాజం, తదితరులు పాల్గొన్నారు.