నిజాం పరిపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
NEWS Apr 02,2025 08:32 am
WNP: సెంట్రల్ యూనివర్సిటీ HCU 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వెయ్యడాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షులు నారాయణ ఖండించారు. పార్టీ ఆఫీస్లో ఆయన మాట్లాడుతూ.. విద్య సంస్థలను అభివృద్ధి చేయకుండా భూములను వేలంవేస్తూ విద్యా వ్యవస్థను ఖూనీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 9వ నిజాం పరిపాలన కొనసాగిస్తుందని విమర్శించారు.