పంజాబ్ కింగ్స్ దెబ్బకు లఖ్ నవూ ఓటమి
NEWS Apr 02,2025 07:31 am
ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన కీలక లీగ్ పోరులో శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చిత్తుగా ఓడి పోయింది. ప్రస్తుతం 18వ సీజన్ కొనసాగుతోంది. పంజాబ్ కు రెండో గెలుపు సాధించింది. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కు షాక్ ఇచ్చింది. లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ ఘోరంగా ఓటమి పాలైంది. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ 69 పరుగులతో చెలరేగి పోగా, స్కిప్పర్ అయ్యర్ 52 పరుగులతో రెచ్చి పోయి నాటౌట్ గా నిలిచాడు. 34 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 4 సిక్సర్లతో రెచ్చి పోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నేహాల్ వధేరా 3 ఫోర్లు 4 సిక్సర్లతో 43 రన్స్ తో కీలక పాత్ర పోషించాడు. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.