సంక్షేమం..అభివృద్ది ప్రభుత్వ లక్ష్యం
NEWS Apr 02,2025 06:33 am
అభివృద్ది, సంక్షేమం తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి వంగలపూడి అనిత.
గత ప్రభుత్వంలో అంగుళం కూడా ముందుకు సాగలేదన్నారు. పదేళ్ల సమగ్ర రక్షిత తాగునీటి పథకం ప్రాజెక్టు పూర్తికోసం ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం జరిగిందన్నారు. 140 గ్రామాలకు నీరందించడమే లక్ష్యంగా పైప్ లైన్ పనులకు నెలకొన్న అడ్డంకులు తొలగించామన్నారు. నేషనల్ హైవే అధికారులు, జిల్లా కలెక్టర్‌తో సమీక్ష చేపట్టారు మంత్రి. ఈ పథకం వల్ల నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం మండలాల్లో తాగునీటి ఎద్దడి తొలగుతుందన్నారు.