ఇంటింటికి సన్నరేషన్ బియ్యం
NEWS Apr 01,2025 11:44 pm
రాష్ట్రంలో పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. దారిద్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారు. రాష్ట్ర జనాభాలో 85 శాతం మంది పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ కావడం రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.