ఆ భూములు ముమ్మాటికీ ప్రభుత్వానివే
NEWS Apr 01,2025 06:03 pm
గచ్చి బౌలి లోని 400 ఎకరాల భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందినవి కావంటూ స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఐఎంజీ భారతితో కోర్టులో కేసు ఉండటం వల్ల ఇన్ని రోజులు ఆ భూమిని ప్రభుత్వం తీసుకోలేదన్నారు. ఇంచు భూమి కూడా యూనివర్సిటీ నుంచి తీసుకోవడం లేదని, ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే తీసుకుంటోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో మోసాలు జరిగాయని ఆరోపించారు. లెక్కలు తీస్తే బొక్కలు ఇరగడం ఖాయమన్నారు టీపీసీసీ చీఫ్.