కేసీఆర్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
NEWS Apr 01,2025 05:53 pm
మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. 2011 అక్టోబర్ 15న సికింద్రాబాద్‌లో రైల్‌రోకో జరిగిన స్థలంలో తాను లేరంటూ న్యాయవాది వెల్లడించారు. దీని కారణంగా రైల్‌రోకో కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఫిర్యాదు చేసిన వ్యక్తికి నోటీసు ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.