కరీంగనర్‌లో త్వరలో లా కాలేజ్
NEWS Apr 01,2025 05:49 pm
కరీంనగర్‌లోని శాతవాహన వర్శిటీకి లా కాలేజీని మంజూరు చేయాలంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ కు బండి సంజయ్ విన్నవించారు. వర్శిటీ వీసీ, మాజీ మేయర్ లతో కలిసి అరగంటకు పైగా భేటీ అయ్యారు. బండి కోరికకు సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రి. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కోర్సులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు బండి. ఈ సందర్బంగా మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.