త్వరలోనే ప్రవీణ్ పగడాల కేసు ఛేదిస్తాం
NEWS Apr 01,2025 05:46 pm
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించిన పూర్తి నివేదిక త్వరలోనే అందుతుందన్నారు మంత్రి వంగలపూడి అనిత. మంత్రిని రాష్ట్ర పాస్టర్ల యూనియన్ నేతలు కలిశారు. ప్రవీణ్ మృతి ఘటన వెనుక ఎవరున్నారో తేల్చాలన్నారు. పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారని చెప్పారు. పూర్తి స్తాయిలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని అన్నారు. ప్రవీణ్ పగడాల అంటే తమకు కూడా గౌరవమేనని పేర్కొన్నారు. కొంత మంది కావాలనే ఈ కేసు విషయంలో రాజకీయం చేస్తున్నారంటూ ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని అన్నారు.