ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ
NEWS Apr 01,2025 05:37 pm
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం పదగంజాం గ్రామ పంచాయతీ కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛను పంపిణీ చేశారు. ఆయా కుటుంబాలతో మాట్లాడి వారి జీవన స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనైనా సరే కూటమి సర్కార్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు సీఎం.