శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం
NEWS Apr 01,2025 08:35 am
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాముల వారు హనుమంత వాహనంపై మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. అదే విధంగా, శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు.