హెచ్సీయూ విద్యార్థుల తరగతుల బహిష్కరణ
NEWS Apr 01,2025 08:29 am
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన భూముల వ్యవహారంపై రగడ కొనసాగుతూనే ఉంది. పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూములు ఎట్టి పరిస్థితుల్లో అప్పగించే ప్రసక్తి లేదంటూ ఆందోళన బాట పట్టారు. మంగళవారం తరగతులు బహిష్కరించాలని పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. నిరసనలు మరింత ఉధృతం చేయాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. విద్యార్థుల ఉద్యమానికి బేషరతుగా మద్దతు ప్రకటించింది బీజేపీ, ఇతర పార్టీలు. సీపీఎం సైతం విద్యార్థులకు బాసటగా నిలిచింది.