తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిట
NEWS Apr 01,2025 08:11 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 73 వేల 7 మంది భక్తులు దర్శించుకున్నారు. 27 వేల 440 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.04 కోట్లు వచ్చినట్లు ఈవో జె. శ్యామల రావు వెల్లడించారు. ప్రస్తుతం స్వామి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 18 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.