బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన జేఈవో
NEWS Apr 01,2025 07:57 am
ఒంటిమిట్టలో ఏకశిలానగరంలో ఏప్రిల్ 5 నుంచి 15 వరకు 10 రోజుల పాటు శ్రీ కోదండరామస్వామి ఆలయం శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సీఎం చంద్రబాబు హాజరవుతారు. ఈ సందర్బంగా పనులను జేఈవో వి. వీరబ్రహ్మం పరిశీలించారు. కళ్యాణ వేదికను సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కల్యాణ వేదిక పక్కన ఉన్న పీఏసీ బిల్డింగ్ పనులను పరిశీలించారు.