ముగిసిన ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు
NEWS Apr 01,2025 06:52 am
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఎల్ఆర్ఎస్ గడువు మార్చి 31తో ముగిసింది. దీనిపై ఇవాళ కేబినెట్ మరోసారి చర్చించనుంది. ఇదిలా ఉండగా డెడ్ లైన్ విధించినా సర్కార్ ఆశించిన స్థాయిలో వసూలు కాలేదు. జనం వద్ద డబ్బులు లేక పోవడం, రియల్ ఎస్టేట్ వేవ్ తగ్గి పోవడం, తలసరి ఆదాయం లేక పోవడం , తదితర కారణాల వల్ల ఎల్ఆర్ఎస్ చెల్లించేందుకు ముందుకు రాలేదు. కాగా ఎల్ఆర్ఎస్ రాయితీ గడువుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఇస్తున్న 25 శాతం రాయితీ కొనసాగిస్తారా లేదా అన్న అంశంపై తేలనుంది. 25 శాతం రాయితీలో మార్పులు ఉండే ఛాన్స్ ఉందని సమాచారం.