ముస్లీం సోదరులకు తాగునీరు అందజేత
NEWS Mar 31,2025 10:15 pm
ముస్లీంల పవిత్ర రంజాన్ పండుగ సందర్బంగా స్థానిక అల్లమయ్య గుట్ట ప్రాంతంలోని ఈద్గ వద్ద ప్రార్థనలు చేపట్టిన మైనార్టీ సోదరులకు ఆదర్శ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో తమ గురువు అల్లె సంగయ్య జ్ఞాపకార్థం తాగునీటిని అందజేశారు. ఈ శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నం అనీల్, కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్ ప్రారంభించారు. కటుకం మహాదేవ్, దగ్గుల నర్సయ్య, కటుకం ప్రసాద్, నామాల రాకేష్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.