జగన్ నిర్వాకం వల్లే ఏపీకి నష్టం
NEWS Mar 31,2025 05:08 pm
బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ సీఎం జగన్ నిర్వాకం కారణంగానే ఏపీ అన్ని విధాలుగా నష్ట పోయిందన్నారు. ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టారని ఆరోపించారు. మద్యం, విద్యుత్, తదితర వాటిల్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రజాగళం వినిపించింది కాబట్టే..ఈ రోజు ఏపీ డబుల్ ఇంజిన్‌తో సుపరిపాలన అందిస్తోందన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమన్వయంతో ముందుకు సాగుతున్నామన్నారు పురంధేశ్వరి.