వెంకన్న కల్యాణోత్సవాలకు మంత్రికి ఆహ్వానం
NEWS Mar 31,2025 03:39 pm
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీవెంకటేశ్వర స్వామి వారి వార్షిక కల్యాణ మహోత్సవాలు ఈ నెల 7వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ సందర్భంగా వాడపల్లి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు విజయవాడలోని కార్యాలయం వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి స్వామి వారి కల్యాణోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. అదేవిధంగా స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను ఆయనకు అందజేశారు.