కాంగ్రెస్ సర్కార్ పై బండి కన్నెర్ర
NEWS Mar 31,2025 02:42 pm
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బీఆర్‌ఎస్ 25 లక్షల చెట్లు తొలగించిందని ఆరోపించారు. హరితహారం పేరుతో కోనోకార్పస్ చెట్లు పెంచి వాతావరణాన్ని దెబ్బ తీసిందన్నారు. ఇప్పుడు గచ్చిబౌలిలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తోందని ధ్వజమెత్తారు. గొడ్డలి మాత్రం ఒకటేనని కానీ చేయి మాత్రం మారిందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం గ్రీన్ మర్డర్ జరుగుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్ కుమార్ పటేల్.