అందరి సహకారం 25 లక్షలకు పైగా సభ్యత్వం
NEWS Mar 31,2025 01:26 pm
అందరి సహకారంతో రాష్ట్రంలో 25 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు చేయడం జరిగిందన్నారు బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. సోమవారం బీజేపీ కీలక సమావేశం జరిగింది. జిల్లా నూతన అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జి ఆహ్వానితులతో భేటీ అయ్యారు. సంస్థాగత అంశాలు, రాజకీయ కార్యాచరణపై చర్చ జరిగింది. ఏప్రిల్ 6 పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 14న అంబేడ్కర్ జయంతి నిర్వహణపై చర్చించారు. పోలింగ్ బూత్ స్థాయిలో ఆరు కార్యక్రమాల నిర్వహణపై నేతలకు సూచనలు చేశారు. 21 వేల మందికి క్రియాశీలక సభ్యత్వం ఇచ్చామన్నారు. 2 లక్షల 18 వేల మంది బూత్ స్థాయిల్లో కార్యకర్తలు పార్టీకి ఉన్నారని చెప్పారు.