వరి వేస్తే ఉరేనంటూ భయపెట్టారు
NEWS Mar 31,2025 08:42 am
సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మాజీ సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో దొర పండించిన వడ్లకు క్వింటాలుకు రూ. 4500 కానీ మనం పండిస్తే కొనేటోడే లేడన్నారు. ఫామ్ హౌస్ లో పండినవి వడ్ల లేక బంగారమా అని ప్రశ్నించారు. 80 వేల పుస్తకాలు చదివిన మేధావి ఎందుకు సన్న బియ్యం ఇవ్వలేదంటూ నిలదీశారు. వరి వేస్తే ఉరేనని రైతులను భయ పెట్టారన్నారు. అందుకే పేదలు పండించిన ప్రతి గింజను మా ప్రభుత్వమే కొంటుందన్నారు. సన్న బియ్యం పండించిన రైతులకు క్వింటాల్ కు రూ. 500 బోనస్ ఇస్తున్నామన్నారు.