యువతిపై సామూహిక అత్యాచారం
NEWS Mar 31,2025 08:20 am
నాగర్ కర్నూల్ జిల్లాలోని ఊరుకొండపేటలో దారుణం చోటు చేసుకుంది. బంధువుతో కలిసి ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చిన యువతిపై ఎనిమిది మంది యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలితో వచ్చిన బంధువుపై దాడికి పాల్పడ్డారు. గుట్టల ప్రాంతంలోకి తీసుకు వెళ్లి రేప్ చేశారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.