టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్
NEWS Mar 30,2025 07:06 pm
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా మరో కీలక మ్యాచ్ ఆదివారం గౌహతి వేదికగా ప్రారంభమైంది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ , స్టాండింగ్ కెప్టెన్ రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. సీఎస్కే స్కిప్పర్ టాస్ గెలిచాడు. మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ చేయనుంది రాజస్థాన్ రాయల్స్. ఇప్పటి వరకు రాజస్థాన్ ఆడిన రెండు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. చెన్నై ఒకటి గెలిచింది. ఆర్ఆర్ ఎస్ఆర్ హెచ్, కేకేఆర్ జట్లతో వరుసగా ఓడి పోయింది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం.