గిరిజన బిడ్డలకు రెండు హాస్టళ్లు మంజూరు
NEWS Mar 30,2025 06:45 pm
సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉగాది పర్వదినం సందర్బంగా విద్యా శాఖ మంత్రిగా ఉన్న ఆయన తీపి కబురు చెప్పారు. విద్యపై పెట్టుబడి భవిష్యత్తు పెట్టుబడిగా తన ప్రభుత్వం భావిస్తుందన్నారు. గిరిజన బిడ్డల సదువుల కోసం ప్రత్యేకంగా రెండు హాస్టళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ఒకటి బాలికలకు, మరొకటి బాలురకు కేటాయించామన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా గిరిజన సంఘాలు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.