పదవుల కంటే సేవా కార్యక్రమాలు బెటర్
NEWS Mar 30,2025 05:40 pm
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో పొందిన పదవుల కంటే స్వర్ణ భారత్ సేవా కార్యక్రమాలు మరింత సంతృప్తి పరిచేలా చేశాయన్నారు. మనతో పాటు మన తోటి వారిని పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టాలన్నదే స్వర్ణభారత్ ముఖ్య ఉద్దేశం అన్నారు. సమాజంలో అరాచకాలు, అత్యాచారాలు, హత్యలు వంటి నేర ప్రవృత్తి పెరిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆలోచనా విధానంలో మార్పు తీసుకొచ్చేందుకు కేంద్రం నూతన విధానాన్ని ప్రవేశ పెట్టిందన్నారు.