ఒడిశాలో రైలు ప్రమాదం ఒకరు మృతి
NEWS Mar 30,2025 05:29 pm
ఒడిశాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు కామాఖ్య ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఆదివారం చౌద్వార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మొత్తం 11 ఏసీ కోచ్ లు అదుపు తప్పాయి. ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. రైలు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించింది రైల్వే శాఖ. పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాక పోకలకు అంతరాయం కలిగింది.