వెంకయ్య నాయుడు సిసలైన ప్రజా నేత
NEWS Mar 30,2025 04:58 pm
సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై ప్రశంసలు కురిపించారు. తాను వెంకయ్య ఒకేసారి ఎమ్మెల్యేలు అయ్యామన్నారు. అసెంబ్లీలో ఆయన మైక్ తీసుకుంటే అందరూ గడగడ లాడి పోయేవారని అన్నారు. ఆయన కష్టపడి అంచెలంచెలుగా ఎదిగారని కొనియాడారు. ఎక్కడున్నా వెంకయ్య నాయుడు ప్రజా హితం కోసమే పని చేశారని ప్రశంసించారు. ఎన్టీఆర్ పదవి కోల్పోయాక తనను సీఎం చేసేందుకు తొలుత పోరాడిన వ్యక్తి ఆయనేనని అన్నారు.