టీడీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు
NEWS Mar 30,2025 01:48 pm
టీడీపీ కేంద్ర కార్యాలయంలో సిద్ధాంతి మాచిరాజు వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. తెలుగు ప్రజలకు ముఖ్య పండుగల్లో ఉగాది మొదటి పండుగ. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి కొత్తగా పనులకు శ్రీకారం చుడతారు. షడ్రుచుల సమ్మేళనం (తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగు వారికి మహా ప్రసాదం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.