ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు
NEWS Mar 30,2025 01:08 pm
శ్రీ విశ్వవాసు నామ తెలుగు ఉగాది సందర్భంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబుకు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, టిటిడి ఈఓ జె. శ్యామలారావు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో చైర్మన్, ఈఓ ముఖ్యమంత్రిని కలిశారు.ఈ సందర్భంగా, ఛైర్మన్ , ఈఓ శేష వస్త్రం, శ్రీవారి తీర్థ ప్రసాదాలను ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీస్సులు అందించారు.