అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా
NEWS Mar 30,2025 09:29 am
సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కోడంగల్ లోని తన నివాసంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ జిల్లా సన్నాహక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. అమిత్ షాను ఏకి పారేశారు. పార్లమెంటులో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడారని ఆరోపంచారు. మహాత్మా గాంధీని చంపిన వారిని ప్రోత్సహించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించడం వల్లే దేశంలో సామాజిక పరివర్తన జరిగిందన్నారు. ప్రజలు కనిపించని దేవుడిగా అంబేద్కర్ ను కొలుస్తున్నారని చెప్పారు.